Duplicate Electrical Items : నకిలీ ఎలక్ట్రిక్ వైర్లు విక్రయించిన షాపు యజమాని అరెస్ట్
By
Vaasthava Nestham
• నకిలీ వి గార్డ్ ఎలక్ట్రిక్ వైర్లు, గోల్డ్ మెటల్ ఎలక్ట్రిక్ సాకెట్ బాక్సులు స్వాధీనం
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో నకిలీ, వి గార్డ్ ఎలక్ట్రిక్ వైర్లు, గోల్డ్ మెటల్ ఎలక్ట్రిక్ సాకెట్ బాక్సులు విక్రయించిన షాపు యజమానిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం..పట్టణంలోని శివాజీ చౌక్ నందు నకిలీ, వి గార్డ్ ఎలక్ట్రిక్ వైర్లు, గోల్డ్ మెటల్ ఎలక్ట్రిక్ సాకెట్లు విక్రయిస్తున్నారని సమాచారం మేరకు కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా కృష్ణ ఎలక్ట్రికల్ షాప్ లో విక్రయిస్తున్న నకిలీ వి గార్డ్ ఎలక్ట్రిక్ వైర్లు, గోల్డ్ మెటల్ ఎలక్ట్రిక్ సాకెట్ బాక్సులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. షాపు యజమానిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు.
Comments