Tahsildar Office : అవినీతి @ రెవెన్యూ కార్యాలయం
By
Vaasthava Nestham
• డబ్బులు ఇస్తే ఏదైనా చేసేస్తారు..!?
• కాసుల కోసం అధికారుల ఇల్లీగల్ పనులు
• గతంలో ఇతర రాష్ట్రాల వారికి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు జారీ
• ఇప్పుడు ఓటర్ జాబితాలో పేర్ల తారుమారకు సహకరించిన రెవెన్యూ అధికారులు
• బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి రెవెన్యూ అధికారుల బాగోతం
• రెవెన్యూ ఇన్స్పెక్టర్ , తహసిల్దార్ పై కేసులు నమోదు
• రేషన్ కార్డుల జారీలో సైతం డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు
• జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ఇచ్చోడ రెవెన్యూ కార్యాలయం
వాస్తవ నేస్తం, ప్రత్యేక ప్రతినిధి : రెవెన్యూ కార్యాలయం ప్రజలకు గుండెకాయలాంటి ది. నిత్యం ప్రజలు, లబ్ధిదారుల రాకతో సందడిగా ఉంటోంది. అలాంటి ఆ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందనే సర్వత్ర విమర్శలు వ్యక్తం అవు తున్నాయి. ఏ చిన్న పని కావలన్నా కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారికి నయన, భయానా చేతిలో పెట్టకుంటే పనులు కావడం లేదనే బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్నతా ధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ రెవెన్యూ కార్యాలయంలో కొందరు అధికారులు ఆడిందే ఆట... పాడిందే పాట అన్న చందంగా మారింది. వివరాల్లోకి..అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల రెవెన్యూ కార్యాలయానికి అవినీతి చెదలు పట్టింది. ఇక్కడ కొందరు అధికారులు రూ. లక్షల్లో జీతాలు పొందుతున్న.. తమకు చాలదన్నట్లు.. లంచాలకు సై మరిగినట్లు ప్రజలు కోడై కూస్తున్నారు. అవినీతి రహిత సమాజం అంటూ సర్కారు.. పాలకులు నిన దిస్తున్నా, క్షేత్ర స్థాయిలో డబ్బు ఉన్నవాడికే న్యాయం అనే సూత్రం ఇక్కడ అమలవుతోంది.
Voter List Forgery ఫోర్జరీ పత్రాలతో.. ఓట్లు తారుమారు..
ఇచ్చోడ మండలంలోని అడేగామ (బీ) గ్రామానికి చెందిన తాజా, మాజీ సర్పంచ్ కదం వనిత, ఆమె భర్త కదం సుభాస్ ల ప్రమేయం లేకుండా వారి ఓట్లను ఇచ్చోడ కు బదిలీ చేశారు. అదే గ్రామానికి చెందిన ఇచ్చోడ తాజా, మాజీ జడ్పీటీసీ (బీజేపీ) కుమారు డైన కదం విశాల్ ఈ పాపంలో ప్రధాన నిందితుడు. రానున్న స్థానిక సంస్థాగత ఎన్నికల్లో తన కుటుంబా నికి ఎదురు ఉండకూడదనే కుట్రతో పొన్న గ్రామానికి చెందిన సిందే అచ్యుత్, ఇచ్చోడ మీ సేవ కేంద్రానికి చెందిన కదం ధనరాజ్ కలిసి నకిలీ నివాస పత్రాలను తయారు చేశాడు. రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ ఐ హుస్సేన్, తహసీల్దార్ సత్యనారాయణ రావ్ ను సంప్రదించి, రూ. 30 వేలతో ఒప్పందం కుదుర్చున్నా డు. సింధే అచ్యుత్ ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లిం చాడు. ఎలక్ట్రోరల్ పోర్టల్ లో ఫారం నంబర్ -8 (Electrol Format ) లో మాజీ సర్పంచ్, ఆమె భర్త ఓట్లను ఇచ్చోడకు బదిలీ చేశారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టా రు. కదం విశాల్, సిందే అచ్యుత్, కదం ధన్ రాజ్, ఆర్.ఐ హుస్సేన్ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సింధే అచ్యుత్ ఫోన్ పే నుంచి సదరు అధికారులకు డబ్బులు పే చేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం తాహసీల్దార్ సత్యనారా యణ రావ్ పరారీలో ఉన్నారు. ఎంఆర్వో పరారీలో ఉన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఓట్ల తారుమారు పై అదిలాబాద్ ఆర్డీవో స్రవంతి రెండు రోజుల క్రితం ఇచ్చోడ రెవెన్యూ కార్యాలయం వచ్చి రహస్యంగా విచారణ చేపట్టినట్లు సమాచారం.
డబ్బులు ఇస్తేనే పనులు...లేదంటే..?
స్థానిక మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఎంఆర్ఐ) వ్యవహారశైలి 'రూటే సపరేటు'. కార్యాలయంలో వచ్చిన ప్రతి ఫైల్ ను ఇతనే పరిశీలిస్తాడు. ఈయన వద్ద ఏ పని జరగాలన్నా, దానికి ముడుపులు తప్పని సరి అని స్థానికులు చెబుతున్నారు. 'దానం చేస్తే పుణ్యం వస్తుంది, పని చేయించుకుంటే డబ్బు పోతుంది' అనే నినాదాన్ని పక్కన పెట్టి, 'డబ్బు ఇస్తేనే పుణ్యం, పని అవుతుంది' అనే సిద్ధాంతాన్ని ఈయన అమలు చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డు పథకాల లబ్ధిదారులను, వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చే వారిని కూడా వదలకుండా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంఆర్ఐ (Revenue Inspector ) రిమాండ్ కు పోలీసులు తరలించినట్లు వివిధ పత్రికల్లో వార్త ప్రచరణ కావడంతో వాటిని కొందరు బాధితులు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసి వైరల్ చేశారు.
జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలి..
"అవినీతి అనేది అంటు రోగం లాంటిది" అని పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు ఆ అంటు రోగం రెవెన్యూ శాఖ లోని కొందరు అధికారులకు అంటి పెట్టుకుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన రేషన్ కార్డులలో కొందరు అనరులకు సైతం రేషన్ కార్డులు జారీ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రేషన్ కార్డుల జారీకి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి కైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరు తున్నారు.
Comments