Soya Seed : సోయా @ గయ
By
Vaasthava Nestham
• రైతన్నను నిండా ముంచిన "ఎస్ఎస్ఆర్ క్రాంతి " విత్తనాలు
• పూత, కాతకు నోచుకోని వైనం
• బాధిత రైతును దాబాయిస్తున్న రంజిత్ ట్రేడర్ యజమాని
• ఫిర్యాదు చేసిన పట్టించుకొని అధికారులు
• న్యాయం చేయాలని రైతన్న వేడుకోలు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడి పోయింది' అన్న చందంగా మారింది ఆ రైతు పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందుల విక్రయాలను అరి కట్టేందుకు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. కొందరు వ్యవసాయ శాఖ అధికారుల అండదండలతో ఫర్టిలైజర్ షాపుల ( fertilizer shop ) యజమానుల తీరు మాత్రం మారడం లేదు.
ఫర్టిలైజర్ షాపుల యజమానులు తమ స్వలాభాల కోసం నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులను (seeds and pesticides ) విక్రయిస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. వ్యాపారులను నమ్మి వారిచ్చిన నకిలీ విత్తనాలు సాగు చేశాక, పురు గు మందులను తీసుకెళ్లి పిచికారి చేసిన తరువాత తీరా పంట నష్టం జరిగాక ఏం చేయాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇదే పరిస్థితి అదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన రైతుకు ఎదురైంది. వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత రైతు ఆసం రవి బోరిగామ గ్రామంలో ఎనిమిది ఎకరాలు వ్యవ సాయ భూమిని కౌలుకు తీసుకు న్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని రంజిత్ ట్రేడర్ పర్టిలైజర్స్ షాప్ లో ఖరీఫ్ సీజన్ లో సోయాబీన్ ( soyabean seed ) బ్యాగులను కొనుగోలు చేశాడు.
27 కిలోలు.. రూ. 2700..
సదరు బాధిత రైతు రంజిత్ ట్రేడర్ పర్టిలైజర్స్ షాప్ యజమాని రూపేష్ వద్ద మొత్తం 9 బ్యాగులను కొను గోలు చేశాడు. ఒక్కొక్క బ్యాగ్ లో 27 కిలోల సోయా బీన్ బస్తా ధర రూ.2700 చొప్పున మొత్తం రూ. 24 వేల 300 చెల్లించాడు. కౌలుకు తీసుకున్న భూమిలో సోయపంటను సాగు చేశాడు. వర్షం అనుకూలంగా కురియడంతో సోయాబీన్ పంట ఏపుగా పెరిగింది. పూత, కాతకు మాత్రం నోచుకోలేక పోయింది. కొను గోలు చేసిన సోయాబీన్ విత్తనాల గురించి పర్టిలైజర్స్ షాప్ యజమానికి విన్నవిస్తున్న పట్టించుకోవడం లేదని బాధిత రైతు వాపోతున్నాడు. వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే వస్తామంటున్నారే తప్పా.. 5 రోజులు గడుస్తున్న ఇంకా రావడం లేరని ఆవేదన వ్యక్తి చేస్తున్నాడు. సోయాబీన్ సాగు వలన రూ లక్షల్లో నష్టం వచ్చిందని రైతు బోరున విలపిస్తున్నాడు. దీనిపై స్తానిక వ్యవసాయ అధికారి రమేశ్ ను సెల్ ఫోన్ ద్వారా సంప్రదిస్తే ఆయన అందుబాటులోకి రాలేకపోయారు. ఇట్టి విషయంపై మండల వ్యవసాయాధికారి ని వివరణ కోసం పలుమార్లు చరవానిలో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
పర్టిలైజర్ షాప్, కంపెనీ పై చర్యలు తీసుకోవాలి
• ఆసం రవి బాధిత రైతు, బోరిగామ
ఎస్ఆర్ఆర్ సోయాబీన్ విత్తనాల చాలా మంచివని, దిగుబడి బాగానే వస్తుందని రంజిత్ ట్రేడర్ షాప్ యజమాని నమ్మకంతో చెప్పడంతో కొనుగోలు చేశాను. పంట సాగు చేసాను. సోయా పంటకు పూత పూయలేదు. కాత కాయలేదు. దీని గురించి రంజిత ట్రేడర్స్ యజమానిని అడిగితే నాకు సంబంధం లేదు. కంపెనీ వారిని అడుగు అంటూ వెటకారంగా మాట్లా డాడు. ఈ కంపెనీ విత్తనాలు చాలా మంచివి, రైతు లందరికీ వీటినే అమ్ముతున్నాను అని నీవు చెబితేనే నీ నమ్మకంతో కొన్నాను కదా అంటే కంపెనీ ఇచ్చిన సోయా విత్తనాలనే నీకు అమ్మినాను. పూత, కాత రాకుంటే నేనేమీ చెయ్యాలి అంటూ దబాయిస్తున్నా డు. కంపెనీ వాళ్ళతోనే మాట్లాడుకో.. నా వద్దకు రావద్దు అంటున్నాడు. నాకు అధికారులు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం.
Comments