Mandal Education officer Retirement :ఏంఈఓ పదవి విరమణకు సర్కారు బడులకు తాళాలు..!?
By
Vaasthava Nestham
• సమీక్ష సమావేశం పేరిట అనధికార సన్మానం
• మధ్యాహ్నం నుంచే విద్యార్థులను ఇంటికి పంపిన వైనం
• ప్రైవేట్ గార్డెన్ లో అంగరంగ సత్కారం
వాస్తవ నేస్తం,నెట్ వర్క్ అదిలాబాద్ డెస్క్ : అతడు మండల విద్యాధికారి. విధులకు డుమ్మా కొట్టే గురువులు, వీధుల పట్ల నిర్లక్ష్యం చేసే ఉపాధ్యాయు లపై శాఖాపరమైన చర్యలు తీసుకునే ఆ అధికారి వ్యవహరించిన తీరు సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ అధికారి పదవి విరమణ నేడు (ఆదివారం) అధికారికంగా ఉంది. సమీక్ష సమావేశం పేరిట మండల ఉపాధ్యాయులందరికీ ఎంఆర్సీ వాట్సాఫ్ గ్రూప్ లో మీరందరు ఆన్ డ్యూటీ (ఓడీ) పెట్టుకుని రివ్యూ సమావేశం రాగలరంటూ పోస్ట్ ఫార్వర్డ్ చేసి, అనధికారిక సన్మానం నిర్వహించుకో వడంతో ప్రభుత్వ బడులకు మధ్యాహ్నం నుంచే మూతపడ్డాయి.
కొందరు ఉపాధ్యాయులు పెండ్లికి వెళ్తున్నామంటూ.. మరి కొందరు ఉపాధ్యాయులు ఫంక్షన్లకు వెళ్తున్నట్లు, ఇలా రకరకాలుగా మాయ మాటలు చెప్పి విద్యార్థులను ఇంటికి పంపించేశారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యు లు గోడం నగేష్ స్వంత మండలం బజార్ హత్నూర్ మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బజార్ హత్నూర్ మండల విద్యాధికారిగా కిషన్ గుప్తా విధులు నిర్వహిస్తున్నారు. అధికారికంగా ఆయన పదవీ విరమణ నేడు ఆదివారం ఉంది. ఆర్జేడీ ఆదేశాల మేరకు మండల ప్రధాన ఉపాధ్యా యులు, క్లస్టర్ పరిధిలోని ఉపాధ్యాయులకు సమా వేశం ఉందంటూ గ్రూప్లో పోస్ట్ చేశారు.
అర్జేడి తో సమావేశం ఉండదు...
ఎంఆర్సీ గ్రూప్ లో ఈ పోస్ట్ ను చూసిన అదే మండలంలోని ఓ ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడు వెంటనే వరంగల్ ఆర్జేడీ కి ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. అలాంటి సమావేశం బజార్ హత్నూర్ లో లేదని, అన్ని మండలాల విద్యాధికారులకు, డీఈవో లకు సమీక్ష సమావేశం ఆదిలాబాద్ లో నిర్వహిస్తు న్నట్లు ఆర్జేడీ ఆ ప్రధానోపాధ్యానికి చెప్పారు. అతను వెంటనే ఆ గ్రూప్ లో సమీక్ష సమావేశం గురించి అందరి ఉపాధ్యాయులకు మెసేజ్ పోస్ట్ చేశాడు. పాఠశాలను బంద్ చేసి, బజార్ హత్నూర్ లో జరిగే సమావేశానికి వెళ్లకండి.. ఎంఈవో ఆదివారం పదవీ విరమణ చేస్తున్నాడు. జిల్లా ఉన్నతాధికారులకు తీసేస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయని, అందుకు ఎంఈఓ బాధ్యుడు కాడని, శిక్ష మనమే అనుభవించా ల్సి ఉంటుందని గ్రూప్ లో సలహా, సూచన ఇచ్చాడు. కొందరు ఉపాధ్యాయులు దీనిని పెడచెవిన పెట్టి, పాఠశాలలకు తాళాలు వేసి వెళ్లారు.
Comments