-Advertisement-

అత్యవసర పరిస్థితుల్లో సమాచారం చేరవేసేది ఎలా..??

Vaasthava Nestham

సెల్ ఫోన్లు పడేసి నిరసన..!
• జియో నెట్వర్క్ లేక ఇబ్బందులు


వాస్తవ నేస్తం,ఇచ్చోడ: గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏమైనా ప్రమాదం జరిగితే అత్యవసర పరిస్థితుల్లో సమాచారం ఎలా చేరవేయాలని..? తమ గ్రామంలో జియో నెట్వర్క్ పనిచేయకపోవడంతో గ్రామస్తులు సెల్ ఫోన్లు కింద పడేసి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామంలో గత కొన్ని రోజుల నుండి జియో టవర్ సక్రమంగా పనిచేయకపోవడంతో సెల్ ఫోన్లు పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు జియో అధికారులకు సమస్య వివరించిన కూడా తమ సమస్య పరిష్కరించడం లేదని గ్రామస్తులు తన సెల్ఫోన్లను కిందపడేసి బండరాళ్లతో సెల్ ఫోన్లు ధ్వంసం చేస్తామని నిరసన తెలిపారు. అధికారులు స్పందించి తమ గ్రామంలో జియో నెట్వర్క్ సేవలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.