-Advertisement-

Local body Eections : ఆశావాహుల్లో అత్యుత్సాహం.. రిజర్వేషన్ల మార్పు ప్రకటనతో ఆగమాగం..!?

Vaasthava Nestham

• అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి..!!
• రిజర్వేషన్లను చూసి ఒళ్ళు సర్సుకుంటున్న రాజకీయ నాయకులు..!?
• ఇన్నేళ్లు ప్రజలకు పెట్టిన ఖర్చు బూడిద పాలైనట్టినా...!?
• సావు , పుట్టుకలకు, ఆపద సమయాలకు చేసిన ధానాలు ఉట్టివేనా..!?


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తూ రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు చేయడంతో రాజకీయ నాయకుల్లో ఉత్కంఠత నెలకొంది. తాము ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుందని లోకల్ లీడర్లలో చర్చలు జరుగుతున్నాయి. రిజర్వేషన్లపై తమ పెట్టుకున్న గంపెడు ఆశలు గల్లంత అయ్యాయని లోకల్ లీడర్లతో పాటు చోటామోటా లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన నాయకులు, ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న నాయకులు సైతం తమకు అనుకూలంగానే రిజర్వేషన్లు వస్తాయని పిలవని పేరంటాలకు, సావు, పుట్టుకలకు, ఆపద సమయాలకు అటెండ్ అయ్యి ఫోటోలకు ఫోజులిచ్చి సింపతి కొట్టేద్దాం అనుకునే తరుణంలో రిజర్వేషన్ల మార్పు చేర్పులతో వారి ఆశలన్నీ తలకిందులు అయ్యాయి. రాజకీయంలో వేయి ఖర్చు పెట్టు, గెలుపొందాక లక్ష సంపాదించు అనే నానుడి ఉంది.. దీనికోసమే చోట నూట లీడర్లు ఇన్నేళ్లు ప్రజలకు పెట్టిన ఖర్చు బూడిద పాలైనట్టినా...!? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాము అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి అని లోకల్ లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. 
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.