Telangana lokayuktha : అసలు హక్కుదారులకు న్యాయం చేయాలని లోకాయుక్త ఆదేశాలు
By
Vaasthava Nestham
• ఫలించిన సామాజిక కార్యకర్త కొమ్ము నరేష్ బాబు న్యాయ పోరాటం
వాస్తవ నేస్తం,వనపర్తి : జిల్లాలోని పెద్దామందడి మండలంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన ఒక రైతుకు బదులు మరొకరికి పట్ట మంజూరు కావడంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సామాజిక కార్యకర్త కొమ్ము నరేష్ బాబు లోకాయుక్త వద్ద పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ అనంతరం తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త, సంబంధిత రెవెన్యూ అధికారులకు రికార్డులను వెంటనే సరిచేయాలని, బాధిత హక్కుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ జారీ చేశారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని లోకయుక్త ఆదేశించింది. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కొమ్ము నరేష్ బాబు మాట్లాడుతూ.. అన్యాయం జరిగిన ప్రజల పక్షాన ఎల్లప్పుడూ న్యాయపోరాటం చేయడానికి తమ సిద్ధంగా ఉంటామన్నారు.
Comments