ఉపాధి హామీ డబ్బుల కోసం మహిళా గొంతు కోసి హత్యా*యత్నం.. నిందితులకు జైలు శిక్ష
By
Vaasthava Nestham
• నిందితులకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం
• బోరిగామ గ్రామంలో జరిగిన ఘటనకు తీర్పు ఇచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఉపాధి హామీ డబ్బుల కోసం హత్యాయత్నం చేసిన ఇద్దరు నిందితులకు ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన బొర్రా విజయ్ కుమార్, షేక్ మీనాజ్ హైమద్ అనే ఇద్దరు నిందితులు శివరాత్రి పండగ రోజు రాత్రి రెండు గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన నర్సమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి ఉపాధి హామీ డబ్బులు అడగగా మహిళా నిరాకరించడంతో నిందితులు మహిళ గొంతును కత్తితో కోయగా మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇంటి వాళ్ళు రావడంతో గమనించిన నిందితులు పారిపోగా మహిళా ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై నరేష్ గత సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన కేసు నమోదు చేశారు. సోమవారం లైసెన్ ఆఫీసర్ పండరి, కోర్టు డ్యూటీ అధికారి రవీందర్ రెడ్డి సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు నిందితులకు ఐదు సంవత్సరాలు కఠిన జైలు శిక్ష, వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. సాక్షులను ప్రవేశ పెట్టడంలో కేసు విచారణ చేయడంలో కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments