ఫేక్ ఇంస్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసి .. మహిళ గురించి చెడు ప్రచారం
By
Vaasthava Nestham
• గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
• నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు
• వివరాలు వెల్లడించిన ఏఎస్పి కాజల్ సింగ్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఫేక్ ఇంస్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసి ఓ మహిళ గురించి చెడు ప్రచారం చేసిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా గుడియత్నూరు మండలలోని లింగాపూర్ గ్రామానికి చెందిన తురత్ గోపాల్ ఇంస్టాగ్రామ్ లో ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఓ మహిళ గురించి వారి బంధుమిత్రులకు సదరు మహిళ గురించి చెడు ప్రచారం చేయగా, సదరు మహిళ సోదరుడు షీ టీంకు ఫిర్యాదు చేశాడు.
సాంకేతికత ఆధారంగా ఫేక్ ఐడి క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. మహిళలు సోషల్ మీడియాలో కానీ, తాము పని చేసే ప్రదేశాలలో గాని, బహిరంగగా గాని వేధింపులకు గురైనట్లయితే వెంటనే షూటింగ్ బృందానికి ఫిర్యాదు చేయాలని ఏఎస్పి కాజల్ సింగ్ అన్నారు.
Comments